: చిన్న కుర్రోడు... ఏదో జనాలను చూసి ఆవేశపడ్డాడంతే!: నాగబాబుపై స్పందించిన యండమూరి


'ఖైదీ నంబర్ 150' చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా, తన పేరును వెల్లడించకుండా, ఓ వ్యక్తిత్వ వికాస నిపుణుడంటూ నాగబాబు చేసిన తీవ్ర వ్యాఖ్యలపై యండమూరి వీరేంద్రనాథ్ స్పందించారు. తాను చానాళ్ల క్రితం ఓ క్లాస్ లో రాంచరణ్, దేవి శ్రీ ప్రసాద్ లను పోల్చుతూ మాట్లాడానని, ఆపై ఎన్నోమార్లు నాగబాబును కలిశానని, ఇప్పుడు ఎవరో ఏదో నూరిపోసిన కారణంగానే ఆయనలా మాట్లాడి వుండవచ్చని అన్నారు.

"ఫాదర్ కాదు ముఖ్యం. జీవితంలో పైకి రావాలంటే టాలెంట్ ఉండాలి అని చెప్పడం ఎవరినీ తక్కువ చేయడం కాదు. చిన్న కుర్రాడు. ఏదో జనాలను చూసి ఆవేశపడ్డాడంతే. రేప్పొద్దున మళ్లీ వస్తాడు. గురువుగారు అంటాడు. ఇట్స్ ఏ స్మాల్ థింగ్" అని ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News