: గౌతమీ పుత్రుడికి ఐదు గంటలు పడితే, ఖైదీ నాలుగ్గంటల్లోపే అందుకున్నాడు!
యూట్యూబ్ లో బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం నెలకొల్పిన టాలీవుడ్ రికార్డును చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' బ్రేక్ చేసింది. శాతకర్ణి చిత్రం ట్రైలర్ ను విడుదల చేసిన తరువాత వన్ మిలియన్ (పది లక్షలు) హిట్స్ రావడానికి 5 గంటల సమయం పట్టగా, ఖైదీ ట్రైలర్ 3 గంటలా 40 నిమిషాల్లోనే పది లక్షల హిట్స్ సాధించింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకూ ఓ ట్రైలర్ ఇంతగా హిట్ కావడం ఇదే తొలిసారి. కాగా, ఒక రోజు ముందుగా విడుదలవుతున్న 'ఖైదీ నంబర్ 150' బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్ల రికార్డును సైతం బద్దలు కొడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.