: రూ. 1,350 కోట్ల ఎంబ్రాయర్ విమానాల డీల్ అవకతవకలపై అమెరికా నుంచి సాక్ష్యాలు తెప్పించిన సీబీఐ


దాదాపు రూ. 1,350 కోట్లతో ఎంబ్రాయర్ విమానాలు కొనుగోలు చేసే దిశగా భారత్ కుదుర్చుకున్న డీల్ లో ముడుపులు అందాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న సీబీఐ, అందుకు సంబంధించిన కీలక ఆధారాలను అమెరికా నుంచి తెప్పించుకుంది. ఈ వ్యవహారంలో ఎఫ్సీపీఏ (ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్) నిబంధనల ఉల్లంఘన జరిగిందని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్ సాక్ష్యాలు తమకు అందాయని, వీటిని అమెరికన్ ఏజన్సీలు అందించాయని, ప్రస్తుతం వీటిని పరిశీలిస్తున్నామని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

మరింత సమాచారం కోసం, బ్రెజిల్ ను సైతం సంప్రదిస్తున్నామని, ఈ డీల్ లో మధ్యవర్తిగా వ్యవహరించిన విపిన్ ఖన్నా రూ. 35 కోట్ల మేరకు ముడుపులు ఇచ్చినట్టు తెలుస్తోందని వెల్లడించారు. కాగా, ఈ డీల్ కుదిరిన 2008 సంవత్సరంలో ఖన్నా పలువురు ప్రభుత్వ పెద్దలకు కోట్ల రూపాయల్లో లంచాలు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అవసరాల నిమిత్తం భారత ప్రభుత్వం ఎంబ్రాయర్ తో విమాన కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News