: నాగబాబు సార్, మీకు ఇంగ్లిష్ అర్థం కాదు కనుక నా ట్వీట్లను తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేయించుకో!: ట్విట్టర్ లో చెలరేగిన రాంగోపాల్ వర్మ
'నా ట్వీట్టర్ అకౌంట్ ని ఎవడో ఇడియట్ హ్యాక్ చేసి తెలుగులో ట్వీట్స్ పెట్టాడు....' అంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నటుడు నాగబాబుకు కౌంటర్ ఇస్తూ బాంబు పేల్చాడు. ఈ సందర్భంగా వర్మ చెబుతూ... అసలు తాను తెలుగులో ట్వీట్ చేయనే లేదని, చిరంజీవికి క్షమాపణలు చెప్పలేదని వర్మ స్పష్టం చేశాడు. 'ప్రజారాజ్యం పార్టీ విషయంలో మీ అన్నయ చిరంజీవికి నువ్వు ఎలాంటి సలహా ఇచ్చావో అందరికీ తెలుసు' అంటూ నాగబాబుకి వర్మ చురక అంటించాడు. 'నాగబాబు సార్, మీకు ఇంగ్లిష్ అర్థం కాదు కనుక, విద్యావంతుడైన స్నేహితుడి ద్వారా నా ఇంగ్లిష్ ట్వీట్లు తర్జుమా చేయించుకుని తెలుసుకోండి' అంటూ సూచించాడు. గ్రేట్ మెగా బ్రదర్ ముందు నాగబాబు 0.01 శాతం మాత్రమేనని, అందుకే నాగబాబులా చిరంజీవి అర్థంపర్థం లేని వాగుడు వాగాలేదని ఘాటుగా చురకలంటించారు. ఇకపోతే 'నాగబాబు సార్, ఇప్పుడే 150 ట్రైలర్ చూశాను...చాలా బాగుంది...అవతార్ కంటే కొంచెం గొప్పగానే ఉంది' అంటూ రాంగోపాల్ వర్మ తనదైన స్టయిల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.