: జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం వచ్చినప్పుడల్లా ధోనీనే కాపాడాడు: కోహ్లీ


టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీపై తనకున్న అభిమానాన్ని కెప్టెన్ కోహ్లీ మరోసారి చాటుకున్నాడు. తన క్రికెట్ కెరియర్లో అందరికన్నా ఎక్కువగా అండగా ఉన్నది ధోనేయేనని చెప్పాడు. జట్టు నుంచి స్థానం కోల్పోయే పరిస్థితి ఎదురైనప్పుడల్లా ధోనీనే తనను ఆదుకున్నాడని తెలిపాడు. చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ధోనీ అంటూ కొనియాడాడు. తనను పూర్తి స్థాయి క్రికెటర్ గా తీర్చిదిద్దింది ధోనీనే అని చెప్పాడు. తాను ధోనీ సారథ్యంలోనే పెరిగానని... తన కెప్టెన్ ఎప్పుడూ ధోనీనే అని తెలిపాడు. ధోనీతో తనను ఎప్పుడూ పోల్చవద్దని కోరాడు.

  • Loading...

More Telugu News