: శ్రీలంకకు బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం శ్రీలంక పర్యటనకు బయలుదేరారు. విజయవాడ నుంచి ఆయన మొదట చెన్నయ్ చేరుకొని అక్కడి నుంచి శ్రీలంకకు వెళతారు. చంద్రబాబుకి ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నుంచి ఇటీవలే ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. శ్రీలంక అధ్యక్షుడు తన రెండేళ్ల పాలనను పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం సిరిసేన నిర్వహిస్తున్న ఓ జాతీయ కార్యక్రమంలో పాల్గొని పేదరిక నిర్మూలనపై చంద్రబాబు ప్రసంగిస్తారు. అలాగే ఆయన ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులపైన కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.