: భారత్ కు స్వర్ణపతకం తెస్తే.. దంగల్ 2 తీస్తారట!


మహవీర్‌ సింగ్‌ ఫోగట్‌, అతని కుమార్తెలు గీతా, బబితా వాస్తవకథ ఆధారంగా రూపొందిన 'దంగల్' సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ సినిమాకు సీక్వెల్ కూడా రూపొందుతుందని మహవీర్ సింగ్ ఫోగట్ మూడో కుమార్తె రీతూ ఫొగట్‌ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 2020 ఒలింపిక్స్‌ లో స్వర్ణం ఎవరు సాధిస్తే వారిపై 'దంగల్ 2' రూపొందిస్తారని తన తండ్రి చెబుతున్నారని తెలిపింది. అలా 'దంగల్ 2' తెరకెక్కితే అందులో సోనాక్షి సిన్హా ప్రధాన పాత్ర పోషించాలని, ఆమె శరీరాకృతి రెజ్లర్ ను పోలి ఉంటుందని ఆమె చెప్పింది. దీంతో 2020 ఒలింపిక్స్ లో పతకం సాధిస్తానని రీతూ ఫోగట్ పరోక్షంగా చెబుతోంది. అమె అంత బలంగా నిర్ణయించుకుంటే రెజ్లింగ్ లో భారత్ కు ఒక స్వర్ణం ఖాయమైనట్టేననడంలో ఎలాంటి సందేహం లేదు. 

  • Loading...

More Telugu News