: తిరుమలలో నేటి రాత్రి ఒంటి గంటకు తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు.. రేపు, ఎల్లుండి భక్తులకు అనుమతి
తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు రోజుల పాటు నడకదారి భక్తులకు టోకెన్లు నిలిపివేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. అలాగే ఆది, సోమవారాల్లో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. నేటి అర్ధరాత్రి ఒంటిగంటకు వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు వైకుంఠ దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. వీవీఐపీల కోసం పద్మావతి, ఎంబీసీ ప్రాంతాల్లోని గదులను టీటీడీ అధికారులు బ్లాక్ చేశారు. ఇక వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.