: లక్ష మందికి ఉపాధి అవకాశాలు: మంత్రి కేటీఆర్
వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్క్ కోసం 1200 ఎకరాలు సేకరించామని, ఇందులో దాదాపు లక్ష మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నది తమ అంచనా అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. మెగా టెక్స్ టైల్ పార్క్ ద్వారా ముఖ్యంగా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. వరంగల్ లో ఇప్పటికే 50 ఎకరాల్లో ఐటీ పార్క్ చేశామని, అందులో నాలుగు పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు.