: లాలూను అవమానించారంటూ ఆర్జేడీ నేత ఆగ్రహం


బీహార్ లో జేడీయూ మిత్రపక్షమైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను అవమానించారంటూ ఆ పార్టీ నేతలు సీఎం నితీశ్ పై మండిపడుతున్నారు. సిక్కు మత గురువు గురు గోబింద్ సింగ్ జయంతి సందర్భంగా ఈరోజు పాట్నాలో నిర్వహించిన ప్రకాశ్ ఉత్సవ్ కార్యక్రమంలో నితీశ్ మాత్రమే వేదికపై కూర్చున్నారని, తమ నేతను విస్మరించారని ఆర్జేడీ నేత రఘువంశ్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో భాగమైన తమ పార్టీ నేతను వేదికపైకి ఆహ్వానించకపోవడం అవమానకరమని, వేదిక కింద లాలూ కూర్చోవడాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని ఆయన అన్నారు. జేడీయూ పద్ధతి చూస్తుంటే తాము మాత్రమే అధికారంలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని, బీహార్ ప్రజలు దీనిని సహించరని అన్నారు.

  • Loading...

More Telugu News