: భారత్ వెళ్తున్నారా?... నగదు మీదే ఆధారపడకండి!: ఆస్ట్రేలియన్లకు ఆ దేశ ప్రభుత్వం సూచన


భారత్‌ లో పర్యటించేందుకు వెళ్లే ఆస్ట్రేలియా పౌరులనుద్దేశించి ఆ దేశ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. భారత్ లో పెద్దనోట్ల రద్దుతో నగదు కష్టాలు ఎదుర్కోనే అవకాశం లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ప్రతి అంతర్జాతీయ బ్యాంక్ లోనూ భారతీయ కరెన్సీ 4,500 రూపాయలు తీసుకునే వెసులుబాటు ఉందని తెలిపింది. భారత్ లో ఆన్ లైన్ చెల్లింపులకు సిద్ధంగా ఉండాలని సూచించింది. భారత్ లో నగదుపై మాత్రమే ఆధారపడవద్దని సూచించింది. భారత ప్రభుత్వం విడుదల చేసిన పెద్ద నోట్లు ఇంకా పెద్దఎత్తున అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించింది. కేవలం 90 డాలర్లకు సమానమైన నగదు మాత్రమే ఏటీఎంల నుంచి వస్తోందని సూచించింది. ఇవి పాటించని పక్షంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. 

  • Loading...

More Telugu News