: మోదీని తప్పించి దేశాన్ని రక్షించండి!: బీజేపీకి మమతా బెనర్జీ సూచన


పెద్ద నోట్ల రద్దు అంశాన్ని వ్యతిరేకించిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి... ప్రధాని మోదీపై ఒంటరి పోరాటం చేస్తున్నారు. మోదీని ఎదుర్కోవడానికి విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీకి ఓ ఆసక్తికర సూచన చేశారు. ప్రధానిగా మోదీ తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని... మోదీని తప్పించి, దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని పదవి నుంచి మోదీని తప్పించి, ఆయన స్థానంలో అద్వానీ లేదా రాజ్ నాథ్ సింగ్ లేదా జైట్లీ పగ్గాలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మోదీనే కారణమని... ప్రధానిగా ఆయన కొనసాగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు.

  • Loading...

More Telugu News