: బడ్జెట్ తేదీల అంశంలో దాఖలైన వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరం లేదన్న సుప్రీంకోర్టు
ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు వచ్చేనెల 4 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చేనెల 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను ప్రభావితం చేసేలా ఆ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని, బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీలను వాయిదా వేయాలని ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను అత్యవసర వాదనల కిందట విచారించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఆ పిటిషన్‌ను విచారించే సమయం వచ్చినప్పుడే విచారిస్తామని తేల్చిచెప్పింది.