: అఖిలేష్ కోసం రక్తంతో లేఖ రాసిన బాలిక!
సమాజ్ వాదీ పార్టీ గుర్తు సైకిల్ ను అఖిలేష్ సింగ్ యాదవ్ కే కేటాయించాలంటూ ఎన్నికల సంఘానికి 15 ఏళ్ల బాలిక రక్తంతో లేఖ రాసింది. తన సోదరుడితో కలసి సిరంజి ద్వారా రక్తం తీసుకుని ఉత్తరం రాసినట్టు సదరు బాలిక తండ్రి తెలిపాడు. శుక్రవారమే ఈ లేఖను పోస్ట్ చేయడానికి తన కుమార్తె ప్రయత్నించిందని... కానీ, తాను అడ్డుకున్నానని చెప్పాడు. రాజకీయాలకు ప్రభావితం కాకుండా, చదువుపై దృష్టి సారించాలంటూ వారికి నచ్చజెప్పానని తెలిపాడు. తమ ప్రాంతంలోని ఓ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కోసం ఇటీవల ఓ వ్యక్తి రక్తంతో లేఖ రాసిన విషయాన్ని వీరు పత్రికల్లో చదివి తెలుసుకున్నారని... ఇప్పుడు అదే తరహాలో లెటర్ రాశారని చెప్పాడు. పార్టీ కార్యకలాపాలన్నింటినీ అఖిలేష్ కే వదిలేయాలంటూ... ములాయంకు కూడా లేఖ రాశారని తెలిపాడు.