: 79 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశాం.. సినిమా చూసేందుకు కేసీఆర్ వస్తానన్నారు: బాలయ్య
తాను నటించిన 100వ సినిమా అయిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రీమియర్ ను చూడాలని కోరుతూ నందమూరి బాలకృష్ణ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్వయంగా కలసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... తెలంగాణలో ఈ సినిమాకు గానూ వినోదపు పన్నును మినహాయించిందుకు హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా అనేక చరిత్రాత్మక ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణను జరిపినట్లు, కేవలం 79 రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తాను ఈ సినిమా ప్రీమియర్ షో చూడాల్సిందిగా కేసీఆర్‌ను కోరానని, అందుకు కేసీఆర్ అంగీకరించారని ఆయన తెలిపారు. ఈ సినిమా కేసీఆర్ చేతుల మీదుగానే ప్రారంభమయిందని బాలయ్య గుర్తు చేశారు.