: టీ-20 సిరీస్ లో మూడు శతకాలతో న్యూజిలాండ్ అద్భుత రికార్డు


టీ-20 పోటీల చరిత్రలో న్యూజిలాండ్ అద్భుత రికార్డును నమోదు చేసింది. ఓ సిరీస్ లో మూడు సెంచరీలను సాధించిన ఘనత ఆ దేశం సొంతమైంది. ఇప్పటివరకూ ఓ సిరీస్ లో రెండు సెంచరీలు చేసిన దేశాల జాబితాలో ఇండియాతో పాటు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఉండగా, తాజాగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న సిరీస్ లో న్యూజిలాండ్ అరుదైన రికార్డు సాధించింది. ఈ సిరీస్ లో మెక్ కల్లమ్ రెండు, మున్రో ఒక శతకం సాధించారు. తాజా మ్యాచ్ విషయానికి వస్తే, 54 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో మున్రో రెచ్చిపోగా, నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ జట్టు 159 పరుగులు సాధించగా, బంగ్లాదేశ్ జట్టు 18.1 ఓవర్లకే 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే న్యూజిలాండ్ 2-0 తేడాతో సిరీస్ నెగ్గింది.

  • Loading...

More Telugu News