: ఇకపై నన్ను నందమూరి బాలకృష్ణ అని పిలవద్దు... ఈ పేరుతో పిలవండి!
ఇకపై తనను బాలకృష్ణగా కాకుండా... బసవ తారకరామపుత్రగా పిలవాలని నందమూరి బాలకృష్ణ కోరారు. కాసేపటి క్రితం హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సూచన చేశారు. ఎన్ని పనులున్నా సమాజ సేవ చేయడం ద్వారా తాను రిలీఫ్ పొందుతానని ఈ సందర్భంగా బాలయ్య అన్నారు. ఎన్ని కష్టాలెదురైనా అనుకున్న పనిని సాధించే పట్టుదలను తన తండ్రి తమకు నేర్పారని ఆయన చెప్పారు. క్యాన్సర్ ఆసుపత్రి భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని.... అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన వంతు ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పారు.