: తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న బాలయ్య.. స్వాగతం చెప్పేందుకు పోటీపడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!


తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ఆహ్వానించేందుకు బాలకృష్ణ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీకి వచ్చిన బాలయ్యకు గేటు ముందే టీడీపీ సభ్యులు స్వాగతం పలుకగా, ఆయనను అభినందించి లోనికి తీసుకు వెళ్లేందుకు పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోటీపడ్డారు. అసెంబ్లీ గేటు వద్దకు బాలయ్య కారు రాగానే, అక్కడే వేచి వున్న రేవంత్ రెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. లోపలికి వెళ్లిన తరువాత, పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఆపై బాలయ్యను లోపలికి తీసుకువెళ్లారు. మరికాసేపట్లో బాలయ్య కేసీఆర్ ను కలవనున్నారు.

  • Loading...

More Telugu News