: మాదిగల ద్రోహి కేసీఆర్ : ఎమ్మార్పీఎస్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మేడ్చల్ జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకుడు కేశపాక రాంచందర్ విమర్శలు గుప్పించారు. నాడు ఉప ముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుంచి తప్పించిన కేసీఆర్, నేడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర పదవీ కాలం పొడిగించకుండా ఆయన్ని అవమానపరిచారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీరును నిరసిస్తూ ఈసీఐఎల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి దళితులను కేసీఆర్ అవమానపరుస్తూనే ఉన్నారని, ఎస్పీ వర్గీకరణ అంశంపై నోరుమెదపని కేసీఆర్.. మాదిగల ద్రోహి అని మండిపడ్డారు.