: రేపు వన్డే జట్టు ఎంపిక...కోహ్లీకి సెలెక్టర్ల ఆహ్వానం!
రేపు ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సెలెక్టర్లు సమావేశం కానున్నారు. ఈ నెల 15 నుంచి ఇంగ్లండ్-భారత్ వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సెలెక్టర్లు వన్డే జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ సందర్భంగా రేపటి సమావేశంలో పాల్గొనాలని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కెప్టెన్ కోహ్లీని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో టీమిండియాలో ధోనీ కోటరీగా పేరొందిన పలువురు ఆటగాళ్లకు సెలెక్టర్లు పెద్దపీట వేస్తారా? లేక కొత్త రక్తానికి జట్టులో స్థానం కల్పిస్తారా? అన్నది చూడాల్సి ఉంది. కాగా, సుదీర్ఘ కాలం తరువాత ధోనీ పరోక్షంలో జట్టును ఎంపిక చేయడం పట్ల ఆసక్తి వ్యక్తమవుతోంది.