: పురుషోత్తమపట్నం ఎత్తిపోతలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఈ కార్యక్రమం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు సాగునీరు, విశాఖపట్నం జిల్లాకు తాగునీటిని ఈ ప్రాజెక్టు ద్వారా అందించనున్నారు. ఏలేరు, పీబీసీ ఆయకట్టులో 80 వేల ఎకరాలకు రెండు పంటలకు సాగునీటిని అందించనున్నారు. మొత్తం ఐదు నియోజకవర్గాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగు నీరు అందనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సముద్రంలోకి వెళ్లే నీటిని డెల్టాకు అందిస్తుంటే ప్రతిపక్షం విమర్శలు చేస్తోందంటూ మండిపడ్డారు.