: క్రిష్ ఆఫీస్ ముందు బాలయ్య అభిమానుల ఆందోళన.. రిలీజ్ డేట్ మార్చాలంటూ పట్టు!
'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకు దర్శకత్వం వహించిన క్రిష్ కార్యాలయం ముందు బాలయ్య అభిమానులు ఆందోళనకు దిగారు. సినిమాను జనవరి 12న కాకుండా 11వ తేదీనే రిలీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. 11వ తేదీన చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' కూడా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో, చిరంజీవి సినిమా రిలీజ్ రోజునే బాలయ్య సినిమాను కూడా విడుదల చేయాలంటూ అభిమానులు ఆందోళన చేశారు. దీంతో 'శాతకర్ణి' నిర్మాత సాయిబాబు బాలయ్య అభిమానులతో మాట్లాడారు. విడుదల తేదీపై రేపు నిర్ణయం తీసుకుందామని నచ్చజెప్పారు. దీంతో, అభిమానులు శాంతించారు.