: ధోనీ నిర్ణయంపై స్పందించిన సాక్షి


వన్డే, టీ20 జట్ల కెప్టెన్సీ నుంచి వైదొలగాలని ధోని తీసుకున్న నిర్ణయంపై అతని భార్య సాక్షి స్పందించారు. గత పదేళ్ల నుంచి భారత క్రికెట్ కు తిరుగులేని కెప్టెన్ గా ధోనీ ఉన్నాడని... ఇకపై అతను సాధించడానికి ఏమీ మిగల్లేదని... అధిరోహించడానికి శిఖరాలు ఏమీ లేవని ఆమె ట్వీట్ చేశారు. తన భర్త క్రికెట్ కెరియర్ ను చూసి తాను చాలా గర్విస్తున్నానని... అతను ఏ నిర్ణయం తీసుకున్నా, ఆలోచించే తీసుకుంటాడని... అతని నిర్ణయం ఏదైనా సరే కరెక్ట్ గానే ఉంటుందని సాక్షి తెలిపారు. తన భర్తను ఆపే ప్రయత్నం తాను ఎన్నడూ చేయనని చెప్పారు. జట్టు కెప్టెన్ గా ఇకపై కొనసాగబోనని ధోనీ నిన్న బీసీసీఐకి సమాచారం అందించిన సంగతి తెలిసిందే. దీంతో, రానున్న ఇంగ్లండ్ సిరీస్ కు ధోనీ కేవలం ఆటగాడిగానే అందుబాటులో ఉండనున్నాడు. 

  • Loading...

More Telugu News