: బడ్జెట్ ఎలా పెడతారు?: ఈసీ ముందు కీలక ప్రశ్న


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ను ప్రకటించిన వేళ, ఈసీ ముందు ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేని అత్యంత కీలకమైన ప్రశ్న మిగిలింది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం దేశ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని భావిస్తున్న తరుణంలో పలు రాష్ట్రాల విపక్షాల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత బడ్జెట్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు రాయితీలు, అధిక నిధులు ప్రకటించి ఓటర్లను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ తదితర ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని విపక్షాలు ఫిర్యాదులు చేశాయి. దీనిపై చర్చించి, త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఈసీ గురువారం నాడు ఓ ప్రకటన వెలువరించింది.

  • Loading...

More Telugu News