: హైదరాబాదు పాతబస్తీలో 250 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్.. నయీం అనుచరుడు సహా 43 మంది అరెస్ట్
హైదరాబాదు పాతబస్తీలో పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు ఫలక్‌నుమా, ఛత్రినాక, శంషేర్‌గంజ్ తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్ అనుచరులు షురేషీ, అసద్, నయీం అనుచరుడు యూసుఫ్‌ఖాన్ సహా 43 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.