: రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఈసారి చార్జీల మోత లేనట్టే!
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. తొలిసారి సంయుక్తంగా ప్రవేశపెట్టనున్న సాధారణ, రైల్వే బడ్జెట్‌లో ఈసారి రైలు చార్జీలను పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. రైల్వేలో మౌలిక సదుపాయాలు, సేవలను మరింత మెరుగుపరిచేందుకు రైలు చార్జీలను పెంచాలని ప్రభుత్వం తొలుత భావించింది. రైల్వేల్లో సంస్కరణలపై గతనెల 20న జరిగిన జాతీయ సదస్సులో రైలు ప్రయాణ చార్జీలు పెంచే అవకాశం ఉందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చూచాయగా చెప్పారు కూడా. అయితే త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చార్జీల పెంపు యోచనను ప్రభుత్వం విరమించుకున్నట్టు తెలుస్తోంది.