: సీఎం కేసీఆర్ పై మండిపడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి


ఫీజు రీయింబర్స్ మెంట్ పై చర్చలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై ఈరోజు జరిగిన చర్చలో తమకు అవకాశమివ్వలేదంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభలో బైఠాయించడం, మార్షల్స్ వారిని బయటకు తీసుకువెళ్లడం.. పోలీసులు వారిని ఆయా పార్టీల కార్యాలయాలకు తరలించడం తెలిసిందే. అనంతరం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సభలో సీఎం కేసీఆర్ ప్రవర్తించిన తీరు సబబు కాదని,  విపక్ష సభ్యులను అవమానించేలా అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు వ్యవహరించారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News