: ఈ ఏడాదిలో మార్కెట్లోకి రానున్న ఆండ్రాయిడ్ బైక్
ఆండ్రాయిడ్ బైక్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దీనిని అమెరికా మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు ఈ బైక్ ను రూపొందిస్తున్న చైనా సంస్థ ‘లీఎకో’ పేర్కొంది. ఆండ్రాయిడ్ డివైజ్ తో అనుసంధానమై పనిచేసే ఈ బైక్ గురించిన విశేషాలు.. మనం ఏ దిశలో వెళ్లాలో హ్యాండిల్స్ పై ఉండే నాలుగు అంగుళాల స్మార్ట్ స్క్రీన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏయే ప్రాంతాల్లో తిరిగామో రికార్డు కూడా చేస్తుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ మ్యూజిక్ వినొచ్చు. ఈ బైక్ ను ఎవరైనా తస్కరించాలని ప్రయత్నిస్తే, వెంటనే సదరు యజమాని ఫోన్ కు సమాచారం వెళ్లిపోతుంది. తస్కరించేందుకు యత్నించిన వ్యక్తి ఫిట్ నెస్ వివరాలను సెన్సర్ల ద్వారా ట్రాక్ చేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.