: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ షేర్లు కొంత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో ఈ రోజు భారతీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 10 పాయింట్లు నష్టపోయి 26,633కు చేరింది. నిఫ్టీ 2 పాయింట్లు కోల్పోయి 8,190కి చేరింది.
ఇవాల్టి టాప్ గెయినర్స్...
జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా (9.96%), మంగళూరు రిఫైనరీ (8.57%), జై ప్రకాశ్ అసోసియేట్స్ (7.93%), జేపీ ఇన్ ఫ్రా (5.35%), హ్యాత్ వే కేబుల్ (4.78%).
టాప్ లూజర్స్...
జస్ట్ డయల్ (-1.89%), సుప్రీమ్ ఇండస్ట్రీస్ (-1.23%), దివీస్ ల్యాబ్ (-1.21%), గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రాడక్ట్స్ (-1.18%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.09%).