: సంక్రాంతికి ఇద్దరు లెజెండ్స్ వస్తున్నారు... స్వాగతం పలుకుదాం: క్రిష్
ఈ సంక్రాంతికి 'ఖైదీ నంబర్ 150', 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధమే జరుగుతోంది. మరోవైపు 'ఖైదీ' సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు వేదిక కూడా దొరక్కపోవడం వేడిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో వివాదాలకు ముగింపు పలికేందుకు దర్శకుడు క్రిష్ ప్రయత్నించాడు.
"ఈ సంక్రాంతికి మనల్ని ఆనందింపజేయడానికి ఇద్దరు లెజెండ్స్ వస్తున్నారు. వారిద్దరికీ స్వాగతం పలుకుదాం" అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, 'ఖైదీ' జనవరి 11న, 'గౌతమీపుత్ర' జనవరి 12న వస్తున్నాయంటూ పోస్ట్ చేశాడు.