: 50 ఏళ్ల వయసులో తల్లి అయిన అమెరికన్ సింగర్


యాభై ఏళ్ల వయసుకు దగ్గరలో ఉన్న హాలీవుడ్ ప్రముఖులు ‘అమ్మ’లు అవుతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత హాలెబెర్రీ నలభై ఏడేళ్ల వయసులో తన రెండో బిడ్డకు, నలభై ఎనిమిదేళ్ల వయసులో కెల్లీ ప్రెస్టన్ తన మూడో బిడ్డకు జన్మనిచ్చారు. నలభై ఆరేళ్ల వయసులో తొలి సంతానానికి జన్మనిచ్చిన జీనా డేవిస్, రెండేళ్ల తర్వాత కవలలకు జన్మనిచ్చింది. తాజాగా, ఏడుసార్లు గ్రామీ అవార్డు సాధించిన అమెరికన్ సింగర్ జానెట్ జాక్సన్ యాభై ఏళ్ల వయసులో తొలి సంతానానికి జన్మనిచ్చింది.

ఆమెకు మగశిశువు జన్మించాడని, తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని జానెట్ జాక్సన్ కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, 2012లో ఖతార్ కు చెందిన వ్యాపారవేత్త విసాం అల్ మనాను ఆమె పెళ్లి చేసుకుంది. తన కుటుంబంపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని తన అభిమానుల కోసం ఇటీవల విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఆమె పేర్కొంది. 

  • Loading...

More Telugu News