: జన్మభూమికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు: చంద్రబాబు
ఏపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం 'జన్మభూమి'కి ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఈ రోజు జన్మభూమి-మా ఊరుపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, గ్రామసభలన్నీ కుటుంబ వాతావరణంలో జరగాలని చెప్పారు. ప్రజలు కానీ, నేతలు కానీ తమ అభిప్రాయాలను చెప్పాలే తప్ప, గొడవలు పడరాదని హెచ్చరించారు. గ్రామసభలన్నీ అనుకున్న సమయంలోనే జరగాలని... ఎవరి కోసమో ఆగకూడదని చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు సకాలంలో నిధులు విడుదల చేయాలని, పెండింగ్ లో ఉంచరాదని అధికారులను ఆదేశించారు.