: అనంతపురంలో రానా షూటింగ్.. ఎన్నికల ప్రచారం సన్నివేశాల చిత్రీకరణ!
యువనటుడు రానా దగ్గుబాటి తన తాజా చిత్రం షూటింగు కోసం అనంతపురం వచ్చాడు. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న 'నేనే రాజు...నేనే మంత్రి' సినిమా షూటింగ్ ప్రస్తుతం అక్కడ నిర్వహిస్తున్నారు. షూటింగులో భాగంగా ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహిస్తున్న రోడ్ షో పార్ట్ ను చిత్రీకరించారు. దీంతో ఈ ప్రాంతం అభిమానుల కోలాహలంతో కిక్కిరిసిపోయింది. ఈ సినిమాలో రానా సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్న రానా వేడుకలు ముగియగానే ఇలా తన పనిలో పడిపోయాడు. ఈ సందర్భంగా రానా పోస్టు చేసిన ఫోటోకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.