: కాసేపట్లో మోగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా?


ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు నేడు నగారా మోగనుంది. శాసనసభ గడువు ముగియడంతో ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, పంజాబ్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయనుంది.

ఇప్పటికే ఈ రాష్ట్రాల్లోని నేతలంతా ఎత్తులు పైఎత్తులతో ప్రచారం సాగిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు బీజేపీ పాలనకు గీటురాయిగా పేర్కొంటుండగా, సమాజ్ వాదీ కుటుంబ కలహాలు బీజేపీని విజయతీరాలకు చేర్చే అవకాశమున్నట్టు, ఈ మేరకు లాలూప్రసాద్ యాదవ్ వంటి రాజకీయనాయకులు ములాయంను హెచ్చరిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. 

  • Loading...

More Telugu News