: అశ్లీల దృశ్యాల వివాదంతో మనస్తాపం చెంది, కిరణ్ బేడీ రాజీనామా?


తన వాట్స్ యాప్ గ్రూప్ నకు అశ్లీల దృశ్యాలు పంపిన అధికారిపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టిన పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీకి, రాష్ట్ర మంత్రి వర్గానికి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేస్తారన్న వదంతులు వినిపిస్తున్నాయి. సహకార సంఘాల రిజిస్ట్రార్ శివకుమార్, ఆమె గ్రూప్ కు అశ్లీల దృశ్యాలు పంపి సస్పెండైన సంగతి తెలిసిందే. ఆయనపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని, డిస్మిస్ చేయాలని బేడీ పట్టుబడుతుండటంతో, సహకార సంఘాల అధికారుల నుంచి నిరసన ప్రారంభమైంది.

ఇక పలువురు మంత్రులు సైతం శివకుమార్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. వాట్స్ యాప్ వంటి సోషల్ మీడియా గ్రూపుల ద్వారా పాలనా వ్యవహారాలను నిర్వహించడం ఏంటని స్వయంగా సీఎం నారాయణస్వామి ప్రశ్నించారు. పలువురు మంత్రులు సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేయడంతో ఆమె ఆకస్మికంగా దేశ రాజధానికి పయనమయ్యారు. రాజీనామా చేసేందుకే ఆమె ఢిల్లీకి వెళ్లారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తన రాజీనామా విషయమై కిరణ్ బేడీ అధికారికంగా స్పందించాల్సివుంది.

  • Loading...

More Telugu News