: ఏడు కొండలకు ప్రతీకగా 7 గ్లోబ్ లతో తిరుపతిలో ఇంటర్నేషనల్ ప్లానిటోరియం


సప్తగిరులను గుర్తు చేసేలా 7 గ్లోబ్ లతో తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి ప్లానిటోరియంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఒక్కో గ్లోబ్ ను 140 మీటర్ల విస్తీర్ణంతో నిర్మిస్తామని, దీనిలో ఆధునిక టెలిస్కోప్ ఉంటుందని, విద్యార్థులు ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేసేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను కల్పిస్తామని వెల్లడించారు. ఇక్కడ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఉంటుందని, ఇంటర్నేషనల్ క్వాలిటీతో నక్షత్రశాలను నిర్మిస్తామని వెల్లడించారు. ప్రపంచంలోని మంచి సైన్స్ మ్యూజియాలతో పోలిస్తే ఇది మెరుగ్గా ఉండేలా చూస్తామని చంద్రబాబు వెల్లడించారు. తిరుపతి పవిత్రతను కాపాడేలా ఉండే ఈ సైన్స్ మ్యూజియం, ప్లానెటోరియం భవిష్యత్తులో నగరానికి మరింత మంది సందర్శకులను ఆకర్షిస్తుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News