: '24కే' పిజ్జా... ఇది చాలా కాస్ట్ లీ గురూ!
ఒకప్పుడు రుచికరమైన వంటకాలు తినేవారు... ఇప్పుడు ఖరీదైన వంటకమే రుచికరమైనదనే సిద్ధాంతం చాలా మందికి వంటబట్టింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఓ రెస్టారెంట్ అత్యంత ఖరీదైన పిజ్జాను రుచికరంగా చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ పిజ్జా ఖరీదు ఎంతంటే... కేవలం లక్షా 30 వేల రూపాయలే! ఇంత ఖరీదైన పిజ్జాలో ఏముంటుందన్న అనుమానం వచ్చిందా? ఈ పిజ్జాలో 24 కేరట్ల బంగారం రేకులు, ఎండబెట్టిన అరుదైన జాతికి చెందిన చేపముక్కలు, అమెరికన్లకు నోరూరించే ఓ రకం దుంపతో దీనిని తయారు చేస్తారు.
ఇది తినాలంటే కూడా రెండు రోజుల ముందు ఆర్డర్ ఇవ్వాలని న్యూయార్క్ లోని ఇండస్ట్రీ కిచెన్ రెస్టారెంట్ చెబుతోంది. పిజ్జా చాలా రుచికరంగా ఉంటుందని ఈ రెస్టారెంట్ భరోసా ఇస్తోంది. అయితే ఈ పిజ్జాపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్... ఇలాంటి పిజ్జాను తాను కొనుగోలు చేస్తే... అందులోని బంగారం రేపర్లు తీసి, బంగారం షాపులో అమ్మేసి, పిజ్జాను దగ్గర్లోని ఆకలితో ఉన్న బాలుడికి ఇస్తానని పేర్కొనగా, మరో నెటిజన్ ఇది చూడడానికి బాగున్నంతగా తినడానికి ఉండదని భావిస్తున్నానని పేర్కొనడం విశేషం.