: మోదీకి వకాల్తా పుచ్చుకుంటున్న కేసీఆర్: దానం నాగేందర్
పెద్దనోట్ల రద్దు ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ వకాల్తా పుచ్చుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు దానం నాగేందర్ మండిపడ్డారు. మొదట్లో పెద్దనోట్ల రద్దును వ్యతిరేకించిన సీఎం, ఇప్పుడు ఎందుకు మాట మార్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తుగ్లక్ నిర్ణయాలతో ప్రజల జీవితాలతో మోదీ ఆడుకుంటున్నారని విమర్శించారు. నోట్ల రద్దును నిరసిస్తూ, ఈ నెల 5వ తేదీన చార్మినార్ నుంచి ఆబిడ్స్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు నాగేందర్ చెప్పారు.