: బీసీసీఐ కొత్త బాస్ ల ఎంపిక బాధ్యతను సీనియర్ న్యాయవాదికి అప్పగించిన సుప్రీంకోర్టు


బీసీసీఐ ప్రక్షాళన దిశగా నిన్న అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ను తొలగిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు నేడు మరో కీలక అడుగు వేసింది. బీసీసీఐకి కొత్త బాస్ లను ఎంపిక చేసే బాధ్యతను సీనియర్ న్యాయవాది అనిల్ దివాన్ కు అప్పగించింది. ఇప్పటివరకూ బీసీసీఐ తరఫున న్యాయవాదిగా ఎఫ్ఎస్ నారిమన్ ఉండగా, తొలుత ఆయనకే కొత్త బాస్ ల ఎంపికను అప్పగించాలని సుప్రీం భావించినట్టు సమాచారం. అయితే, తనకు ఆ బాధ్యత వద్దని ఆయన విన్నవించడంతోనే అనిల్ దివాన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News