: ‘మెగాస్టార్’ మనవరాళ్ల ‘దంగల్’ !
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మితా కొణిదెల ఒక ట్వీట్ చేశారు. అమీర్ ఖాన్, ‘దంగల్’ అండ్ టీమ్ నిర్మించింది కేవలం సినిమాను మాత్రమే కాదని, స్ఫూర్తిని ఇచ్చారని, ఈ చిత్రాన్ని ఇప్పటికే రెండు సార్లు చూశామని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. మరో విషయమేమింటే, తమ ఇంట్లో ‘దంగల్’ ఫీవర్ పట్టుకుందని, పేర్కొంటూ, 'మా ఇంట్లో లిటిల్ రెజ్లర్స్..' అంటూ తన ఇద్దరూ కూతుళ్లు కుస్తీ పడుతున్న ఒక ఫొటోను ఆమె పోస్ట్ చేశారు.