: కోడి పందాలు పెట్టుకుంటాం... అనుమతించాలని సుప్రీంకోర్టులో పిటిషన్
తెలుగు ప్రజలకు, ముఖ్యంగా కోనసీమ సంప్రదాయంలో కలసిపోయిన సంక్రాంతి కోడిపందాలకు అనుమతి ఇవ్వాలని ఏపీ బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కోళ్లను పెంచుకోవడం ప్రతి ఒక్కరి హక్కని, అది తప్పెలా అవుతుందని, వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగేలా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరారు. కాగా, ఈ పిటిషన్ పై 5 లేదా 6న విచారణ జరుగుతుందని సమాచారం.