: పెళ్లి చేసుకుంటానని చెప్పి నలుగురిపై అత్యాచారం చేశాడు... బాధితురాళ్లలో ఐటీ ఉద్యోగి కూడా...!


పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆపై అత్యాచారం చేసి, అందినకాడికి డబ్బులు గుంజి, మోసం చేస్తున్న యువకుడి ఉదంతం పూణేలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, అమిత్ జాదవ్ అనే వ్యక్తి తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను అంటూ వివాహ సంబంధాల వెబ్ సైట్లో ప్రకటన ఇచ్చాడు. దీంతో, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఓ యువతి అతడిని సంప్రదించింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకుని, రోజూ మాట్లాడుకునేవారు. ఒక రోజు ఉన్నట్టుండి ఆమెకు ఫోన్ చేసి... తాను రెండేళ్ల కోసం విదేశాలకు వెళుతున్నానని, ఈలోగా నిశ్చితార్థం చేసుకుందామని చెప్పి ఆ అమ్మాయిని తన ఫ్లాట్ కు రప్పించుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. వీసా కోసమంటూ డబ్బులు కూడా తీసుకున్నాడు.

రెండు నెలల తర్వాత తమ మధ్య ఉన్న బంధాన్ని తెంచుకుంటున్నానని ఆ యువతితో అమిత్ చెప్పాడు. దీంతో, తానిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని బాధితురాలు అడగ్గా... ఇవ్వనని చెప్పాడు. దీంతో, పోలీసులకు ఫిర్యాదు చేసింది సదరు యువతి. పోలీసులు రంగంలోకి దిగి అమిత్ ను పట్టుకున్నారు. ఆ సమయంలో అమిత్ పక్కన మరో యువతి ఉంది. అనంతరం జరిపిన విచారణలో.. ఇదే విధంగా మరో నలుగురు యువతులపై అత్యాచారం జరిపి, మోసం చేసినట్టు తేలింది. 

  • Loading...

More Telugu News