: తిరుమల మొదటి ఘాట్ లో ప్రమాదం
ఈ ఉదయం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఘాట్ లోని 30వ మలుపు వద్ద ఓ బైకు ప్రమాదవశాత్తూ డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగం, మలుపును అంచనా వేయలేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గాయపడిన వారిని తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.