: నల్లధనం అంటే నల్లరంగులో ఉండదు: పురంధేశ్వరి
నల్లధనం అంటే నల్లగా ఉండదని బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి తెలిపారు. గుంటూరులో ఆమె మాట్లాడుతూ, నల్లధనం అంటే ట్యాక్స్ కట్టకుండా ఇళ్లలో, బీరువాల్లో దాచుకున్న ధనమని అన్నారు. బీజేపీ కార్యకర్తలు గ్రామగ్రామానికి వెళ్లి మోదీ తీసుకొచ్చిన పథకాలను ప్రచారం చేయాలని అన్నారు. నోట్ల రద్దుతో తమ లక్ష్యం నెరవేరిందని అన్నారు. బ్యాంకుల్లో ఉన్న లూప్ హోల్స్ బయటపడ్డాయని ఆమె అన్నారు. బ్యాంకు అధికారులు పరపతి గలవారితో ఎలా ములాఖాతైంది తెలిసిపోయిందని ఆమె చెప్పారు. త్వరలో బినామీలపై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. బినామీ చట్టాన్ని చేస్తామని ఆమె తెలిపారు.