: మా పిల్లల్ని అనాథలుగా చూడొద్దు: వీణావాణీ తల్లిదండ్రులు


తమ పిల్లల్ని అనాథలుగా చూడొద్దని అవిభక్త కవలలు వీణావాణీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, మురళీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న వీణావాణీని, హైదరాబాద్ యూసఫ్ గూడలోని స్టేట్ హోంకు తరలించిన విషయమై తమకు మాటమాత్రం కూడా చెప్పలేదని వారు ఆరోపిస్తున్నారు. స్టేట్ హోంలో ఉన్న తమ పిల్లలను చూసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, వీణా వాణి ఆపరేషన్ కోసం ప్రభుత్వం ప్రయత్నించాలని, లేనిపక్షంలో తమకు విషం ఇచ్చి చంపాలని వారు కన్నీరుమున్నీరయ్యారు.

కాగా, వారికి ఊహ తెలిసినప్పటి నుంచి పదకొండేళ్ల పాటు సంరక్షణ బాధ్యతలను నీలోఫర్ ఆస్పత్రే చూసుకుంది. అయితే, ఈ ఆసుపత్రిలో పదమూడేళ్ల లోపు చిన్నారులకు మాత్రమే వైద్య సేవలందిస్తారు. ఈ నిబంధనల నేపథ్యంలో ఇటీవలే 13వ జన్మదినోత్సవం జరుపుకున్న వీణావాణీలను ఆసుపత్రి నుంచి స్టేట్ హోంకు పంపించాల్సి వచ్చింది. 

  • Loading...

More Telugu News