: విశాఖపట్టణం చేరుకున్న పవన్ కల్యాణ్


ప్రమఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్టణం చేరుకున్నారు. రేపు సాయంత్రం శ్రీకాకుళం జిల్లా ఇఛ్ఛాపురంలో భారీ బహిరంగ సభ, ఉద్దానం ప్రాంతంలో పర్యటనను పురస్కరించుకుని నేటి సాయంత్రానికి పవన్ కల్యాణ్ వైజాగ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు విశాఖ మెగాఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ, ఆయనను ఆహ్వానించారు. కాగా, రేపు మధ్యాహ్నం పవన్ ఇచ్ఛాపురం చేరుకుని ర్యాలీలో పాల్గొంటారు. ఈ మేరకు పార్టీ ఏర్పాట్లు చేసింది. కాగా, పవన్ కల్యాణ్ రాకతోనైనా శ్రీకాకుళంలో సమస్యలు ప్రపంచానికి తెలుస్తాయని స్థానికులు పేర్కొంటున్నారు. 

  • Loading...

More Telugu News