: పులికి పాలుపట్టించి ముచ్చట తీర్చుకున్న తమిళ కమెడియన్ సతీష్!


కోలీవుడ్ యువ కమెడియన్ సతీష్ తన ముచ్చట తీర్చుకున్నాడు. పులికి పాలుపట్టించాల్న తన కోరికను ఓ జంతు ప్రదర్శనశాలకు వెళ్లి తీర్చుకున్నాడు. జూలోని సిబ్బంది పులి పిల్లకి పాలు పట్టిస్తుండగా, తాను కూడా పాలు పట్టిస్తానని వారికి చెప్పి, సతీశ్ ఆ పులిని ఒళ్లోకి తీసుకున్నాడు. దానికి మిల్క్ బాటిల్ తో పాలు పట్టించి తన సరదా తీర్చుకున్నాడు. ఈ సమయంలో చుట్టూ అభిమానులుండడం విశేషం. అనంతరం సతీష్‌ అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చాడు. కాగా, సతీష్ ఇటీవల విడుదలైన ‘రెమో’ సినిమాలో కామెడీతో అలరించిన సంగతి తెలిసిందే. కావాలంటే ఆ వీడియోను మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News