: చరణ్, బన్నీ, విశాల్ నాకు మంచి స్నేహితులు: తమన్నా


టాలీవుడ్ లో రాంచరణ్, బన్నీ, కోలీవుడ్ లో విశాల్ తనకు మంచి స్నేహితులని మిల్కీ బ్యూటీ తమన్నా తెలిపింది. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, వీరితో కలసి పనిచేస్తున్నప్పుడు చాలా బాగుంటుందని తెలిపింది. సాధారణంగా స్నేహితులతో కలిసి నటించేటప్పుడుండే ఫీల్ వేరు కదా? అని ప్రశ్నించింది. సెట్ లో మంచి వాతావరణం ఉంటే బాగా నటించవచ్చని చెప్పింది. అలాంటి వాతావరణం నటనపై ప్రభావం చూపుతుందని తమన్నా పేర్కొంది.

టాలీవుడ్ లో మహేష్, తారక్ తో ఒక్కోసినిమాలో మాత్రమే నటించానని, వారితో మళ్లీ మళ్లీ నటించాలని ఉందని చెప్పింది. తారక్ కు తాను మంచి అభిమానిని తెలిపింది. తారక్ నటన, డ్యాన్స్ ఇలా ప్రతీదీ బాగుంటుందని తమన్నా చెప్పింది. తాను తెలుగమ్మాయినైపోయానని చెప్పింది. ఇంట్లో హిందీ మాట్లాడే ప్రయత్నం చేసినా, 'నీకు తెలుగే బాగా వచ్చు, తెలుగే మాట్లాడు' అని తన తల్లి చెబుతుందని తమన్నా పేర్కొంది. తనపై అభిమానులు చూపించే ప్రేమాప్యాయతలకు ధన్యవాదాలని చెప్పింది. 

  • Loading...

More Telugu News