: రేపటి నుంచి గ్రామ గ్రామానికి వెళతా.. మోదీ నిర్ణయం వల్ల తలెత్తిన నష్టాలని వివరిస్తా: వీహెచ్
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు ప్రకటన చేసి 50 రోజు పూర్తయిన తరువాత కూడా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆయన అన్నారు. పెద్దనోట్ల రద్దుతో ఎక్కువ నష్టం కలిగింది పేదలకే తప్ప ధనవంతులకు కాదని ఆయన చెప్పారు. నోట్ల రద్దుతో తలెత్తిన దుష్పరిణామాలపై రేపటి నుంచి ప్రచారం చేస్తానని ప్రకటించారు. గ్రామ గ్రామానికి వెళ్లి మోదీ వారికి కలిగించిన నష్టాన్ని వివరిస్తానని చెప్పారు.