: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు


కర్నూలు, కడప జిల్లాల రైతులకు అత్యంత కీలకమైన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రారంభించారు. కృష్ణా నది మిగులు జలాలను కర్నూలు-కడప కాలువ (కేసీ కెనాల్)కు తరలించేందుకు ఈ పథకాన్ని చంద్రబాబు చేపట్టారు. ఈ పథకం ద్వారా మూడు, నాలుగు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు. కేసీ కెనాల్ 81 కి.మీ. ప్రాంతంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. నీటిని పంప్ చేయడానికి నాలుగు అత్యాధునిక విద్యుత్ మోటార్లను అమర్చారు. కృష్ణా నది మిగులు జలాల నుంచి 60 రోజుల పాటు కేసీ కెనాల్ కు 5 టీఎంసీల నీటిని పంప్ చేస్తారు. ఈ కార్యక్రమానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News